Prabhas : అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్.. కల్కి ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్ ఏం మాట్లాడాడు..?

ప్రభాస్ ఆ బుజ్జి వెహికల్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాక ఒక క్రేన్ మీద నిలబడి అందరికి అభివాదం చేసి మాట్లాడాడు.

Prabhas : అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్.. కల్కి ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్ ఏం మాట్లాడాడు..?

Prabhas Speech in Kalki 2898AD Movie Bujji Launch Event

Prabhas : నిన్న(మే 22) రాత్రి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో కల్కి సినిమా భర్తీ ఈవెంట్ నిర్వహించి సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ని లాంచ్ చేసారు. ఆ వెహికల్ కి బుజ్జి అని స్వీట్ గా పేరు పెట్టుకున్నారు. అలాగే ఆ బుజ్జికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. ఇక ఈవెంట్ లో ప్రభాస్ ఆ వెహికల్ ని స్వయంగా డ్రైవ్ చేసుకొచ్చి గ్రౌండ్ లో రౌండ్స్ వేశారు.

కల్కి బుజ్జి లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ తో పాటు మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల మీడియాతో పాటు అభిమానులు కూడా వచ్చారు. ఈ ఈవెంట్లో ప్రభాస్ ఆ బుజ్జి వెహికల్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాక ఒక క్రేన్ మీద నిలబడి అందరికి అభివాదం చేసి మాట్లాడాడు.

Also Read : Kalki Bujji Glimpse : కల్కి బుజ్జి గ్లింప్స్ చూశారా? ప్రభాస్ నడిపే వెహికల్ ఓ రేంజ్‌లో ఉందిగా..

ప్రభాస్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. హాయ్ డార్లింగ్స్ అంటూ వచ్చిన అభిమానుల్ని పలకరించాడు. గ్లింప్స్ బాగుందా అని అడిగాడు. ఈవెంట్ కి తక్కువ మంది ఫ్యాన్స్ ని పిలవడానికి, ఇలా చుట్టూ ఫెన్సింగ్స్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే, సారీ డార్లింగ్స్. ముందుగా కమల్ సర్ కి, అమితాబ్ సర్ కి చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నటించినందుకు. వాళ్ళిద్దరితో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ సర్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించాను. దీపికా, దిశా అందమైన అమ్మాయిలు నటించారు. ఈ ఏజ్ లో కూడా అశ్వినీదత్ గారు సినిమా కోసం తపన పడుతున్నారంటే చాలా గ్రేట్. డబ్బుకు వెనకాడకుండా ఈ సినిమాని తీశారు. అశ్వినీదత్, వాళ్ళ ఇద్దరి కూతుళ్ళకు సినిమాపై ఉన్న ప్యాషన్ గురించి అందరికి చెప్పి వాళ్ళ దగ్గర నేర్చుకోమంటాను. బుజ్జిని నాగ్ అశ్విన్ ఈ రేంజ్ లో ఇంట్రడ్యూస్ చేసాడు. లవ్ యు డార్లింగ్స్ అని అన్నారు. ఇక ఈవెంట్లో ప్రభాస్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.