Prabhas Spirit Movie : ఫస్ట్‌ టైమ్‌ ఖాకీ డ్రెస్‌లో రెబెల్‌ స్టార్‌

Prabhas Spirit Movie : ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సలార్-2 స్టార్ట్ చేయబోతున్నాడు.

Prabhas Spirit Movie : ఫస్ట్‌ టైమ్‌ ఖాకీ డ్రెస్‌లో రెబెల్‌ స్టార్‌

Prabhas Spirit Movie

Updated On : October 29, 2024 / 10:02 PM IST

Prabhas Spirit Movie : పాన్‌ ఇండియా స్టార్‌ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత నార్త్‌ టు సౌత్‌ ఏ స్టేట్‌లో అయినా ఫ్యాన్స్ ఆయన మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే వరుస మూవీస్‌ చేస్తూ ఫుల్‌ టైట్‌ షెడ్యూల్‌లో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సలార్-2 స్టార్ట్ చేయబోతున్నాడు. మరోవైపు హనురాఘవపూడి పౌజీ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

అయితే, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీకి కమిట్‌ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని త్వరలోనే ట్రాక్‌ ఎక్కబోతుందన్న చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌ మూవీలో ప్రభాస్ పోలీస్ కాప్‌గా చేయబోతున్నాడంటూ సందీప్ రెడ్డి వంగా చెప్పటం ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేస్తుంది. అయితే పోలీస్ అంటే ఎలాంటి పోలీస్‌గా కనిపిస్తాడనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. దీని గురించి లేటెస్ట్‌గా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ప్రభాస్ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడంటా.

ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ క్యారెక్టర్స్ వేరు, ప్రభాస్ చేసే మాస్ పోలీస్ క్యారెక్టర్ వేరంటున్నారు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టు పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటాడో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే మాస్ పోలీస్ అంటే ఇంకా ఎలా వుంటాడో అంటూ అభిమానుల అంచనాలు పెరుగుతున్నాయి. టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న స్పిరిట్‌ మూవీకి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుందని మొదటి నుంచి మూవీ టీమ్ చెబుతోంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో ప్రభాస్‌ ఫస్ట్‌ టైమ్‌ ఖాకీ డ్రెస్‌లో పోలీస్‌గా కనిపించబోతున్నాడు.

Read Also : Rahasya Ghorak : మా ఆయన కోసమైనా ఈ సినిమా చూడండి.. ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ర‌హ‌స్య కామెంట్స్ వైర‌ల్‌