×
Ad

Spirit : ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ అదిరిందిగా.. ఆజానుబాహుడు ప్రభాస్ కటౌట్..

నేడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. (Spirit)

Spirit

Spirit : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్టు ప్రభాస్ స్వయంగా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపాడు.(Spirit)

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్, తృప్తి డిమ్రి జంటగా స్పిరిట్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడని సందీప్ వంగ తెలిపాడు. నేడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Also Read : Gatha Vaibhavam Review : ‘గత వైభవం’ మూవీ రివ్యూ.. జన్మజన్మల ప్రేమకథ..

ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి మీద గాయాలతో నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉండగా పక్కనే తృప్తి డిమ్రి చీరలో ప్రభాస్ సిగరెట్ ని వెలిగిస్తూ నిల్చుంది. ఈ పోస్టర్ తో ఏదో భీకరమైన యాక్షన్ సీక్వెన్స్ తర్వాత సీన్ అని తెలుస్తుంది. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ ఇండియా సినిమా ఆజానుబాహుడు, ఆజానుబాహు లను చూడబోతుంది అని పోస్ట్ చేసాడు సందీప్ వంగ.

ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొల్పారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ తో ఫుల్ హ్యాపీలో ఉన్నారు.

Also Read : Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..