Prabhas Unstoppable episode releasing on December 30
Unstoppable : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహా అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇటీవల ప్రభాస్, గోపీచంద్ ఈ షోకి వచ్చారు. ఆ ఎపిసోడ్ నుంచి కొన్ని స్టిల్స్, గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ ఎపిసోడ్ కోసం.
చాలా రోజుల తర్వాత ఇలా ప్రభాస్ బయటకి రావడం, తన క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి రావడం, గ్లింప్స్ లో సరదాగా మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ వస్తున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని ఆహా టీం న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న స్ట్రీమ్ చేయనుంది. ఈ మేరకి అధికారిక ప్రకటన చేశారు.
Pathaan : పఠాన్ సినిమాపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి పిర్యాదు..
దీంతో అప్పటి వరకు ఆగాలా అంటూ ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే రిలీజయిన ప్రభాస్ గ్లింప్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ఆ రోజు అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. అయితే అన్‌స్టాపబుల్ లో ఈ లోపే మరో ఎపిసోడ్ రానుంది. జయసుధ, జయప్రద, రాశిఖన్నా ముగ్గురు భామలతో సందడి చేసిన బాలయ్య ఎపిసోడ్ డిసెంబర్ 23న స్ట్రీమ్ కానుంది.
Digital records deserves a Digital CutOut! Here is one for you Darlings❤️ Episode premieres December 30.#PrabhasOnAha#NandamuriBalakrishna #Prabhas pic.twitter.com/RvTh5RL5xW
— ahavideoin (@ahavideoIN) December 19, 2022