Balakrishna-Prabhas : మాసీఎస్ట్ ఎపిసోడ్ అఫ్ అన్స్టాపబుల్ సీజన్ 2 .. ఇట్స్ అఫీషియల్.. బాలయ్యతో బాహుబలి..
గత కొన్ని రోజులుగా బాలయ్య అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో ఒక స్పెషల్ వీడియో కూడా తీశారు. తాజాగా దీనిపై ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ, ప్రభాస్ కి సంబంధించి.......

prabhas will coming soon to Balakrishna Unstoppable show
Balakrishna-Prabhas : బాలయ్య బాబు హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్స్టాపబుల్ షోకి ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ సారి సీజన్ 2 లో ఇప్పటికే పలువురు యువ హీరోలు, టాలీవుడ్ సీనియర్స్, పలువురు పొలిటీషియన్స్ వచ్చి సందడి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా బాలయ్య అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో ఒక స్పెషల్ వీడియో కూడా తీశారు.
తాజాగా దీనిపై ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ, ప్రభాస్ కి సంబంధించి ఒక వీడియో చేసి బాలయ్య షోకి బాహుబలి త్వరలో రానున్నదని తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ మీడియా ముందుకి వచ్చి చాలా రోజులవ్వడంతో ఈ షో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాక్ షోలో వస్తున్నాడని తెలియడంతో నార్త్ లో కూడా ఈ ఎపిసోడ్ పై క్రేజ్ ఏర్పడింది.
Hit 2 Movie Success Tour : హిట్ 2 టీం సక్సెస్ టూర్..
త్వరలోనే బాలయ్యతో ప్రభాస్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసి న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం. అలాగే అసలు ఎక్కువగా మాట్లాడని ప్రభాస్ తో బాలకృష్ణ ఏం మాట్లాడిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్స్టాపబుల్ షో మంచి వ్యూస్ దక్కించుకొని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ వస్తే ఆ ఎపిసోడ్ కచ్చితంగా రికార్డులు బద్దలుకొడుతుంది అంటున్నారు.
The Bahubali episode #Unstoppable Season 2 is coming soon ?
Watch out for more updates ✌?#UnstoppableWithNBKS2 #NBKOnAHA #NandamuriBalakrishna @PrabhasRaju #NBKWithPrabhas #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/yDW1T5NypP— ahavideoin (@ahavideoIN) December 11, 2022