‘రాధే శ్యామ్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

  • Publish Date - July 10, 2020 / 10:25 AM IST

ప్రభాస్ అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్ర‌భాస్ 20వ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుదలయ్యింది. సినిమా అప్‌డేట్స్ చెప్ప‌టం లేదంటూ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ పై ఓ ద‌శ‌లో ప్ర‌భాస్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగ‌గా.. ఈ క్రమంలోనే ఫస్ట్‌లుక్ ఇచ్చేసింది.

ముందుగా ప్ర‌చారం జ‌రిగిన‌ట్లే ప్ర‌భాస్ 20వ చిత్రానికి రాధే శ్యామ్ అని టైటిల్ ఖ‌రారు చేయ‌గా… ప్ర‌భాస్, పూజా హెగ్దే రొమాంటిక్ లుక్ పోస్ట‌ర్ విడుదల చేశారు. ‘బాహుబలి’ తరువాత ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ‘రాధే శ్యామ్’లో నటిస్తుంది.

ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ లాక్ డౌన్‌కు ముందు జార్జియాలో జరిగింది. పోస్టర్‌ను విడుదల చేయగానే అది వైరల్ అయింది. ఈ సినిమాలో పూజాహెగ్డే, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటించారు.

Read Here>>జీవితంలో స్పెషల్ సినిమా ఇదే అంటోన్న నమత్రా