pradeep ivana love today movie completed 100 days
Love Today : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు చిన్న సినిమాలే భారీ విజయాలు సాధిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా, ఎవ్వరికి తెలీకుండా వచ్చి భారీ హిట్స్ కొడతాయి కొన్ని సినిమాలు. అన్ని పరిశ్రమలలోను ఇది జరుగుతుంది. ఇటీవల తమిళ్ లో లవ్ టుడే పేరుతో వచ్చిన సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా రాధికా, యోగిబాబు, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోగా నటించిన ప్రదీప్ ఈ సినిమాని దర్శకుడిగా కూడా తెరకెక్కించాడు.
కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా మొదట తమిళ్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకోవాలంటే ఒకరి ఫోన్ ఒకరు మార్చుకొని వాడాలి అనే ఓ కొత్త కాన్సెప్ట్ తో కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులని మెప్పించింది. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రదీప్, ఇవానా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తమిళ్ లో హిట్ అయిన తర్వాత ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజయింది. 5 కోట్లతో తెరకెక్కిన లవ్ టుడే సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ ప్రాఫిట్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.
Alt Balaji : పేరు మార్చుకున్న ఓటీటీ.. తప్పుకున్న కంపెనీ హెడ్స్..
తాజాగా ఈ లవ్ టుడే సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులకు కూడా లవ్ టుడే సినిమా తమిళనాడులోని కొన్ని సెంటర్స్ లో ఆడుతుండటం విశేషం. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రదీప్ కి అవకాశాలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ ఇవానాకు కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి 100 రోజుల సెలబ్రేషన్స్ చేసుకుంది లవ్ టుడే.
The most successful Tamil movie Post-pandemic..
Congratulations ?@pradeeponelife @i__ivana_ @thisisysr @Ags_production @archanakalpathi
@aishkalpathi pic.twitter.com/uPTvoxtdq9— Ramesh Bala (@rameshlaus) February 11, 2023