Pradeep Ranganathan – Mamitha Baiju : తెలుగు నిర్మాతలు.. తమిళ్ హీరో.. మలయాళం హీరోయిన్.. సూపర్ హిట్ కాంబో సెట్టు..

తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.

Pradeep Ranganathan Mamitha Baiju Combo Movie in Mythri Movie Makers

Pradeep Ranganathan – Mamitha Baiju : ఇటీవల పాన్ ఇండియా సినిమాల నేపథ్యంలో అన్ని సినీ పరిశ్రమల వ్యక్తులను కలుపుతూ సినిమాలు తీస్తున్నారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి తెలుగు, తమిళ్ లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు తమిళ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ త్వరలో కృతిశెట్టితో LIK అనే సినిమాతో రానున్నాడు.

తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ అయిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం.

Also Read : RC 16 Update : RC16 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఆ టైంకే.. చరణ్ బర్త్ డే రోజు..

తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, మలయాళం హీరోయిన్ మమిత బైజు కాంబోలో సినిమా రానుంది. ఈ సినిమాని కీర్తి స్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు – తమిళ్ బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, హీరోయిన్, నిర్మాతలు కలవడం, యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో – హీరోయిన్ కాంబో సెట్ చేయడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి.