Pradeep Ranganathan missed the chance to do a film with Mahesh Babu
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. డైరెక్టర్ నుంచి హీరో అయిన ప్రదీప్ పట్టుకుందల్లా బంగారం అవుతోంది. లవ్ టుడే తో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన డ్రాగన్, డ్యూడ్ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు(Pradeep Ranganathan). ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మూడు సినిమాలు కూడా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాదించడం. ఇలా మొదటి మూడు సినిమాలు కూడా రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. అయితే, ప్రదీప్ రంగనాథన్ మొదట దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆయన మొదటి సినిమా “కోమలి”. జయం రవి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిదని. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అయితే, ఈ సినిమాను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడట ప్రదీప్. అందుకోసం చేయని ప్రయత్నం లేదట. చాలా రోజుల పాటు మహేష్ బాబు ఆఫీస్ చుట్టూ తిరిగాడట ప్రదీప్. కానీ, మహేష్ కి కథ చెప్పే అవకాశం రాలేదట. కనీసం కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదట. అదే సమయంలో జయంత్ రవి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కోమలి మూవీ సెట్ అయ్యిందట. అలా తన మొదటి సినిమాను మహేష్ బాబుతో మిస్ చేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.
ఇక ప్రదీప్ రంగనాథన్ సినిమాల విషయానికి వస్తే, ఇటీవల డ్యూడ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో త్వరలోనే లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను నయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.