Maa Elections: ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్!

'మా'కు ఇప్పటికి కూడా సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడినైతే 'మా' సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 'మా' అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు ప్రకాష్ రాజ్. సినీ కళాకారులకు సాయం చేయాలనే సహృదయం కలిగిన నటులు ఇండస్ట్రీలో ఉన్నారని వారందరిని ఒకతాటిపైకి తీసుకొస్తానని తెలిపారు.

Maa Elections: ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్!

Maa Elections

Updated On : June 21, 2021 / 7:43 AM IST

Maa Elections: త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సేవ కార్యక్రమాలు చేస్తున్నాని తెలిపారు రాజ్. తాను కర్ణాటకలో ఆరు ప్రభుత్వ పాఠశాలలను నడిపిస్తున్నాని.. మూడు గ్రామాలను దత్తత తీసుకోని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా.. ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా సేవలు అందించగలననే నమ్మకం తనకుందని తెలిపారు ప్రకాష్ రాజ్. ఇక చిరంజీవి మద్దతుపై కూడా స్పందించారు.. ఆయన ఏ ఒక్కరికి మద్దతు ఇవ్వరు.. మంచి చేస్తారు అనుకున్న వారికి అన్నయ్య చిరంజీవి మద్దతు ఉంటుందని వివరించారు. తెలుసు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని.. వాటన్నింటిని పరిష్కరించగలను అనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

‘మా’కు ఇప్పటికి కూడా సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడినైతే ‘మా’ సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ‘మా’ అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు ప్రకాష్ రాజ్. సినీ కళాకారులకు సాయం చేయాలనే సహృదయం కలిగిన నటులు ఇండస్ట్రీలో ఉన్నారని వారందరిని ఒకతాటిపైకి తీసుకొస్తానని తెలిపారు.

దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదని, కానీ గతంలో ఉన్న పేరు ఇప్పుడు లేదని తాను అధ్యక్షుడినైతే ఇండస్ట్రీకి పూర్వవైభవం తీసుకురాగలననే నమ్మకం తనకుందని వివరించారు.