Pranavi Manukonda : పక్క భాష హీరోయిన్స్‌కి మన నేటివిటీ ఉండదు.. హీరోయిన్స్ పై వ్యాఖ్యలు చేసిన ప్రణవి..

ఇటీవల తెలుగు హీరోయిన్స్ అనే చర్చ మరోసారి బాగా జరుగుతుండటంతో ప్రణవి కూడా దీనిపై వ్యాఖ్యలు చేసింది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రణవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై వ్యాఖ్యలు చేసింది.

Pranavi Manukonda : పక్క భాష హీరోయిన్స్‌కి మన నేటివిటీ ఉండదు.. హీరోయిన్స్ పై వ్యాఖ్యలు చేసిన ప్రణవి..

Pranavi Manukonda sensational comments on Tollywood Heroins

Updated On : July 27, 2023 / 7:09 AM IST

Pranavi Manukonda : సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రణవి మానుకొండ తెలుగమ్మాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్, సినిమాలు చేసిన ప్రణవి ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రణవి ఈ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల తెలుగు హీరోయిన్స్ అనే చర్చ మరోసారి బాగా జరుగుతుండటంతో ప్రణవి కూడా దీనిపై వ్యాఖ్యలు చేసింది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రణవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై వ్యాఖ్యలు చేసింది.

ప్రణవి మాట్లాడుతూ.. నేను తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్‌గానే భావిస్తాను. మనకు ఉండే నేటివిటీ మన వాళ్లకే ఉంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి మన తెలుగు నేటివిటీ ఉండదు. తెలుగు సినిమాలో తెలుగమ్మాయి అయితే బాగా సూట్ అవుతుంది. రెగ్యులర్ కారెక్టర్లు కాకుండా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా డీ గ్లామర్‌గానైనా నటిస్తాను అని తెలిపింది.

Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ రిలీజ్ తర్వాత యానిమేటెడ్ వర్షన్ సినిమా కూడా?

అలాగే.. నేను పలు సీరియల్స్ లో కూడా నటించాను. సీరియల్, సినిమాలకు నటించే విధానంలో తేడా ఉంటుంది. సీరియల్స్‌లో డ్రామా ఎక్కువగా ఉండాలి. సినిమాల్లో రియలిస్టిక్‌గా ఉండాలి. నాకు ఆ రెండు రకాల అనుభవం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉంది అని తెలిపింది. ప్రణవి హీరోయిన్స్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారాయి.