Prasanth Varma Shared working Still with Rishab Shetty from Jai Hanuman Work
Jai Hanuman : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హనుమాన్ తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించగా ఇందులో హనుమంతుడిగా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.
ఇక నిన్న దీపావళికి జై హనుమాన్ సినిమా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో చాలా ఫాస్ట్ గానే వర్క్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో రిషబ్ శెట్టితో ఉన్న ఓ ఫోటో రిలీజ్ చేసారు. ఇందులో రిషబ్ హనుమంతుడి గెటప్ లో ఉండగా ప్రశాంత్ వర్మ రిషబ్ తో మాట్లాడుతూ సీన్ వివరిస్తున్నట్టు ఉంది.
Also Read : Lucky Baskhar : అదరగొట్టిన దుల్కర్.. లక్కీ భాస్కర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా??
దీంతో జై హనుమాన్ షూట్ మొదలుపెట్టాశారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ఈ ఫోటో షేర్ చేసి.. జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమంతుడిలా కనపడటానికి మీరు చేసిన డెడికేషన్ కు నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి కు ధన్యవాదాలు. ఈ పాత్ర కోసం మారడానికి ఆయన పడ్డ కష్టం వర్ణించలేనిది. ఆయన ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వనున్నారు. జై హనుమాన్ సినిమా వర్క్ త్వరలో మొదలుపెట్టడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే ఈ ఫోటో జై హనుమాన్ ఫస్ట్ లుక్ కోసం చేసిన ఫోటోషూట్స్ నుంచి పోస్ట్ చేసిందని తెలుస్తుంది. షూటింగ్ త్వరలోనే మొదలవ్వనున్నట్టు సమాచారం. రిషబ్ శెట్టి కాంతార 2 అవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.