Prashanth Neel : సలార్ సెట్‌లో ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడండి..

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి.. మరింతమంది స్టార్లు ఈ సినిమాలో భాగం అయ్యారు. 28 సెప్టెంబర్ 2023న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా నేడు(జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో....

Prashanth Neel Birthday Celebrations in Prabhas Salaar Movie Shoot

Prabhas :  KGF సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్(Prashanth Neel). తెలుగు వాడైనా కన్నడ సినీ పరిశ్రమకు వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేసి KGF సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ సినిమాతో ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత NTR 31వ సినిమా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా ఉందని టాక్ నడుస్తోంది. దీంతో తెలుగులో ఒక్క సినిమా తీయకుండానే ప్రశాంత్ నీల్ కి భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

777 Charlie : కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు.. 777 చార్లీ సినిమా కుక్క పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయి..

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి.. మరింతమంది స్టార్లు ఈ సినిమాలో భాగం అయ్యారు. 28 సెప్టెంబర్ 2023న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా నేడు(జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి సలార్ సెట్ లో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశారు. చిత్రయూనిట్ మధ్యలో ప్రశాంత్ నీల్ కేక్ కట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కూడా పక్కనే ఉన్నాడు. దీంతో ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ ఎప్పటిలాగే తలకు గుడ్డ కట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని బ్లాక్ డ్రెస్ లో కనిపించాడు. ప్రభాస్ లుక్ కూడా వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.