Salaar Trailer : సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్.. వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్..
ప్రభాస్ అభిమానులు సలార్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Prashanth Neel Wife Likitha Reddy Gave Salaar Movie Trailer Latest Update
Salaar Trailer Update : ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
సినిమా రిలిజ్ దగ్గర్లో ఉన్నా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. కనీసం సలార్ ట్రైలర్ అయినా రిలీజ్ చేయమని అభిమానులు సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి రచ్చ చేస్తే ఇటీవలే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7.19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Also Read : Salaar : సలార్ సినిమాని దేశమంతా, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో..?
తాజాగా సలార్ ట్రైలర్ కి సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైఫ్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ రికార్డింగ్ స్టూడియోని ఫోటో తీసి పెట్టి సలార్ ట్రైలర్ కట్ వర్క్ జరుగుతుంది అని పోస్ట్ చేసింది. అలాగే మరోసారి ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సలార్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్టూడియోలో సలార్ పార్ట్ 1 ట్రైలర్ కట్ వర్క్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి చేయిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ అభిమానులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
???? ?? ??? ?? ????????? ???????????? ?#SalaarCeaseFire Trailer is set to detonate on Dec 1st at 7:19 PM ?
Happy Deepavali Everyone ? #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/Q1DPgZeCda
— Salaar (@SalaarTheSaga) November 12, 2023