HanuMan Collections : హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు.. ఏడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ ఎంతంటే..?

Prashanth Varma Teja Sajja Hanuman Movie one week collections report

HanuMan Collections : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ సూపర్ హీరోగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘హనుమాన్’. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం.. పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ప్రేక్షకాదరణతో పాటు కలెక్షన్స్ ని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. ఇక ఈ మూవీ రిలీజయ్యి వారం పూర్తి అయ్యింది.

ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసిన విషయం తెలిసిందే. ఇక మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా 150 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 150 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంటే షేర్ కలెక్షన్స్ 75 కోట్లకు పైగా వచ్చినట్లే. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా సాదించేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతుంది.

Also read : Vijay – Rashmika : రష్మికతో ఎంగేజ్మెంట్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్..

అటు అమెరికాలో కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అమెరికాలో ఈ సినిమా 3.5 మిలియన్ పైగా కలెక్షన్స్ ని అందుకొని.. ఆదిపురుష్, సాహో, భారత్ అనే నేను, రంగస్థలం రికార్డులను బ్రేక్ చేసింది. మరో రెండు రోజుల్లో ‘అల వైకుంఠపురములో’ రికార్డుని కూడా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అమెరికాలో ‘అల వైకుంఠపురములో’ సినిమా 3.6M కలెక్షన్స్ ని అందుకుంది.

అల వైకుంఠపురములో కలెక్షన్స్ ని క్రాస్ చేస్తే హనుమాన్.. అమెరికా టాప్ 5 ఇండియన్ తెలుగు మూవీస్ లిస్టులో స్థానం దక్కించుకున్నట్లు అవుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, సలార్, బాహుబలి 1 చిత్రాలు ఉన్నాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ 8.47M డాలర్స్ ని రాబట్టింది. అక్కడి వరకు హనుమాన్ చేరుకోవడం అంటే కష్టమే. మరి హనుమాన్ ఏం చేస్తాడో చూడాలి.