Vijay – Rashmika : రష్మికతో ఎంగేజ్మెంట్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్..

ఫిబ్రవరిలో రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్. దీని పై విజయ్ మాట్లాడుతూ..

Vijay – Rashmika : రష్మికతో ఎంగేజ్మెంట్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్..

Vijay Deverakonda opens up about engagement with Rashmika Mandanna news

Updated On : January 19, 2024 / 7:55 PM IST

Vijay Deverakonda – Rashmika Mandanna : టాలీవుడ్ ఆన్ స్క్రీన్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రియల్ లైఫ్ లో కూడా కపుల్ గా మారబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఓ నేషనల్ మీడియా విజయ్, రష్మిక.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ వార్తలు రాసుకొచ్చింది. ఇక ఈ న్యూస్ కాస్త బాగా వైరల్ అయ్యింది.

తాజాగా ఈ విషయం పై విజయ్ దేవరకొండ మాట్లాడారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఈ వార్తలు పై రియాక్ట్ అవుతూ.. “మీడియా వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేసేస్తున్నారు. ప్రతిసారి ఆ రూమర్ ని సృష్టిస్తున్నారు. వాళ్లంతా నా పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. అందుకనే ఈ ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్మెంట్ చేసేస్తున్నారు. కానీ వాటిలో ఏ నిజం లేదు” అంటూ పేర్కొన్నారు.

Also read : SSMB29 : స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్.. వర్క్ షాప్ కోసం యూరోప్‌కి మహేష్.. రైటర్ విజయేంద్రప్రసాద్ కామెంట్స్..

కాగా ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నారు. గీతగోవిందం వంటి హిట్టుని అందించిన పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం సమ్మర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఈ మూవీ తరువాత గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ VD13 చేయనున్నారు.

ఇక రష్మిక విషయానికి వస్తే.. రీసెంట్ గా ‘యానిమల్’తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 వంటి మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, రెయిన్ బో సినిమాలు చేస్తున్నారు. తమిళంలో ధనుష్ తో ఓ సినిమా, హిందీలో ‘చావా’ అనే ఓ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. కెరీర్ ఇలా బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం అనేది జరిగే విషయం.