SSMB29 : స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్.. వర్క్ షాప్ కోసం యూరోప్‌కి మహేష్.. రైటర్ విజయేంద్రప్రసాద్ కామెంట్స్..

SSMB29 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యినట్లు రైటర్ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇక మహేష్ వర్క్ షాప్ కోసం..

SSMB29 : స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్.. వర్క్ షాప్ కోసం యూరోప్‌కి మహేష్.. రైటర్ విజయేంద్రప్రసాద్ కామెంట్స్..

Vijayendra Prasad comments about Rajamouli Mahesh Babu SSMB29 Movie

SSMB29 : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక అభిమానుల చూపులన్నీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న SSMB29 మీదకి మళ్ళాయి. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది..? అనే ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని రైటర్ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిపోయినట్లు విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇక తాజాగా మహేష్ యూరోప్‌కి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ SSMB29కి సంబంధించిందే అని తెలిసింది. జర్మనీలో సినిమాకి సంబంధించిన మూడు నాలుగు రోజుల వర్క్ షాప్ జరగనుందట. ప్రీ విజువలైజేషన్ కి సంబంధించిన వర్క్ షాప్ అని తెలుస్తుంది.

Also read : #90s Web Series : 90s వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. శివాజీ లవ్ స్టోరీ..

ఈ మూవీలో చాలా వర్క్ గ్రాఫిక్స్ పై ఉండబోతుందని తెలుస్తుంది. దానికి తగ్గట్లు మహేష్ కి ప్రీ విజువలైజేషన్ పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఈ వార్తలతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీ ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ తరహాలో అడ్వెంచర్ స్టైల్లో ఉందబోతుందట.

ఇక ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా సినిమాలో మహేష్ తో పాటు ఇంకే నటీనటులు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో కనిపించే అవకాశం ఉందని విజయేంద్రప్రసాద్ గతంలోనే తెలియజేశారు. కాగా ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.