#90s Web Series : 90s వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. శివాజీ లవ్ స్టోరీ..

90s వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు. అలాగే సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుంది..? శివాజీ చెప్పిన లవ్ స్టోరీ ఐడియా ఏంటి..?

#90s Web Series : 90s వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. శివాజీ లవ్ స్టోరీ..

Sivaji 90s A Middle Class Biopic web series season 2 story line update

Updated On : January 19, 2024 / 6:48 PM IST

#90s Web Series : శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో మౌళి తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఈటీవీ విన్ లో ఆరు ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్టుగా నిలిచింది. మిడిల్ క్లాస్ లైఫ్ ని కళ్ళకి కట్టినట్లు చూపించిన ఈ చిత్రం.. ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంది. దీంతో ఆడియన్స్ అంతా ఈ సిరీస్ కి కొనసాగింపు కోరుకుంటున్నారు.

ఆల్రెడీ దీనికి కొనసాగింపుగా సెకండ్ సీజన్ ఉంటుందని ఫస్ట్ సీజన్ ఎండ్ లోనే మేకర్స్ అనౌన్స్ చేసేశారు. దీంతో ఈ సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలాగే దాని కథ ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకుంది. తాజాగా ఈ సిరీస్ సక్సెస్ మీట్ లో సెకండ్ సీజన్ స్టోరీ లైన్ పై దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడారు. ఇంటర్ కాలేజీ డేస్ బ్యాక్ డ్రాప్ తో సెకండ్ సీజన్ ఉండబోతుందట.

ఇంటర్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్ షిప్ లో ఒకరి గురించి ఒకరు తెలుసుకునేలోపే ఇంజనీరింగ్ కి వెళ్ళిపోతారు. అలాగే కాలేజీ స్టడీస్ కోసమని ఎక్కడో పల్లెటూరు నుంచి టౌన్ కి వచ్చి హాస్టల్ లో ఉంటారు. ఇక ఇల్లు, పల్లెటూరి లైఫ్‌కి.. హాస్టల్, టౌన్ లైఫ్‌కి కల్చర్ చేంజ్ చూసి చాలా మంది భయపడతారు, తికమకపడతారు. కాలేజీ అల్లరి చేస్తూ బయటకి పొగరుగా కనిపించిన స్టూడెంట్ కూడా నైట్ పడుకునే ముందు ఇంటి లైఫ్ గుర్తుకు వచ్చి ఇంటర్ రెండేళ్ల కచ్చితంగా ఏడుస్తారు.

Also read : Sivaji : చంద్రబాబు, జగన్‌తో నాకు సంబంధం లేదు.. ఏపీ ఎన్నికల్లో శివాజీ ఎటువైపు..

ఈ అంశాలనే సీజన్ 2లో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక సీజన్ 2 గురించి శివాజీ మాట్లాడుతూ.. “సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేసి నాకు ఏమైనా లవ్ స్టోరీ పెడతారేమో అనుకున్నాను. ఏదైతే ఏముంది, ఇప్పుడైనా ఒక ఎపిసోడ్ లో నా ఫ్లాష్ బ్యాక్ వేసి లవ్ స్టోరీ చూపించవచ్చు” అని దర్శకుడికి సలహా ఇస్తూ సరదాగా మాట్లాడారు. అలాగే ఈ వెబ్ సిరీస్ ని త్వరలోనే సినిమాగా థియేటర్స్ లోకి తీసుకు రాబోతున్నట్లు తెలియజేశారు.

ప్రస్తుతం ఆ పనులు కూడా జరుగుతున్నాయట. సినిమా వెర్షన్ కి తగ్గట్లు సిరీస్ ని కట్ చేస్తున్నారట. ఆ మూవీని ఎప్పుడు తీసుకు వచ్చేది త్వరలోనే చెబుతామంటూ పేర్కొన్నారు. సినిమా వచ్చినా.. ఈ సిరీస్ ని మాత్రం సీజన్ 2, సీజన్ 3 అని ఓటీటీ ద్వారా ముందుకు తీసుకు వెళ్తామంటూ తెలియజేసారు. సీజన్ 2 కంటే ముందు దర్శకుడు ఆదిత్య హాసన్ ఓ సినిమా చేయనున్నారట. ఆ తరువాత సీజన్ 2 స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.