పదిమంది ఉండగా.. ‘ప్రతిరోజూ పండగే’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్ విడుదల..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్ విడుదల..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
‘పది మంది ఉండగా.. ప్రతిరోజు పండగే.. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే’.. అంటూ సాగే పాట వినసొంపుగా ఉంది. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కె.కె. లిరిక్స్ రాశారు.. శ్రీ కృష్ణ చాలా బాగా పాడాడు.. ‘తండ్రీ, కొడుడకుల అనుబంధం, కుటుంబ విలువలు, భావోద్వేగాలు తెలుపుతూ రూపొందుతున్న సినిమా ఇది.. డిసెంబర్ 20న రిలీజ్ చేస్తాం’ అని మేకర్స్ చెప్పారు.
Read Also : అబ్దాలీ నీడ పడితే మరణం ప్రళయ తాండవం చేస్తుంది : ‘పానిపట్’ ట్రైలర్
విజయ్ కుమార్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. సంగీతం : థమన్, కెమెరా : జయ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : రవీందర్, నిర్మాత : బన్నీ వాసు.