అంచనాలు పెంచేసిన ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్
అంజనాదేవి గారి చేతుల మీదుగా ‘ప్రతిరోజు పండగే’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ మూడోవారంలో గ్రాండ్ రిలీజ్..

అంజనాదేవి గారి చేతుల మీదుగా ‘ప్రతిరోజు పండగే’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ మూడోవారంలో గ్రాండ్ రిలీజ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి గారి చేతుల మీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉండి, కేవలం అయిదు వారాలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్న సత్యరాజ్ చివరి కోరికగా విదేశాల్లో ఉండే తన వారిని చూడాలనుకోవడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. మనవడు వచ్చి తాతని సంతోష పరచడం.. ఇది సినిమా కథ అని ట్రైలర్‌లో చూపించారు.
‘మారే కాలంతో పాటు మనమూ మారాలి.. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’ వంటి డైలాగులు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో మనుషుల మధ్య బంధాలు, సంబంధాలు.. కుటుంబ విలువలు చాటిచెప్తూ తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.