Predator Badlands : ‘ప్రెడేటర్ : బ్యాడ్‌ల్యాండ్స్’.. హాలీవుడ్ సినిమా తెలుగులో కూడా అదరగొడుతుందిగా..
ఈ హాలీవుడ్ సినిమాకు ఇక్కడ కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.(Predator Badlands)
Predator Badlands
Predator Badlands : హాలీవుడ్ సినిమాలు ఇటీవల రెగ్యులర్ గా భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ సినిమా నిన్న నవంబర్ 7న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఇండియాలో కూడా రిలీజ్ అయింది. దీంతో ఈ హాలీవుడ్ సినిమాకు ఇక్కడ కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.(Predator Badlands)
బ్యాడ్‌లాండ్స్ ఈసారి కేవలం రక్తపాతం, వేట మాత్రమే కాకుండా యాక్షన్, సై-ఫై, మానవ సంబంధాలు, కామెడీతో తెరకెక్కించారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా, థ్రిల్ తగ్గకుండా ఉందని ఆడియన్స్ చెప్తున్నారు. జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్, క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయి. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంది. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్ ఎమోషనల్ సీన్స్ బాగానే ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి.
డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. మొత్తానికి హాలీవుడ్ సినిమా ప్రెడేటర్ : బ్యాడ్‌ల్యాండ్స్ యాక్షన్, ఎమోషన్, హ్యూమర్, థ్రిల్ తో ఇందులో కూడా మాస్ సినిమాలా మెప్పిస్తుంది.
