Premalu Actress Mamitha Baiju Movies Biography Full Details Here
Mamitha Baiju : ఏ హీరోయిన్ ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఏ నటికి ఎప్పుడు పేరొస్తుందో తెలీదు. కొంతమందికి మొదటి సినిమాతోనే స్టార్ డమ్ వస్తుంది. కొంతమందికి చాలా సినిమాలు చేసిన తర్వాత గాని సరైన గుర్తింపు రాదు. ఇటీవల ఓ ఇద్దరు హీరోయిన్స్ బాగా వైరల్ అవుతున్నారు. యానిమల్ సినిమా వచ్చినప్పటి నుంచి త్రిప్తి డిమ్రి(Tripti Dimri) బాగా వైరల్ అయింది. ఆ సినిమాలో తన క్యూట్ నటనతో పాటు, తన అందాలతో ప్రేక్షకులని, ముఖ్యంగా యూత్ ని బాగా మెప్పించడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
కొత్త క్రష్ వచ్చింది అంటూ త్రిప్తి డిమ్రిని బాగా వైరల్ చేశారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో త్రిప్తి డిమ్రి హవా నడిచింది. అంతకు ముందు పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు యానిమల్ లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ తో వచ్చింది. ఆ గుర్తింపుతో ఇప్పుడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇదే బాటలో ఇప్పుడు ఇంకో హీరోయిన్ వైరల్ అవుతుంది. ఆమే ‘ప్రేమలు’ హీరోయిన్, మలయాళీ భామ మమిత బైజు.
ఇటీవల మలయాళంలో వచ్చిన రామ్ కామ్ ‘ప్రేమలు'(Premalu) సినిమా అక్కడ భారీ హిట్ అవ్వడంతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసాడు. ఇక్కడ కూడా ప్రేమలు సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీను పాత్రలో నటించిన మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది మమిత. ఏకంగా రాజమౌళి సైతం నాకు మమిత నచ్చింది అని ట్వీట్ చేసాడు.
Also Read : Harish Shankar : పాపం రోడ్డు మీద ఆగిపోయిన కార్.. తోస్తూ హెల్ప్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత..
ఇక ప్రేమలు సినిమాలో మమిత క్యూట్ హావభావాలు, నటన, అందం చూసి తెలుగు యువత ఆమె మాయలో పడిపోయారు. సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా మమిత ట్రెండ్ అవుతూనే ఉంది. కొత్త క్రష్ అంటూ మమితని తెగ ప్రమోట్ చేస్తున్నారు. మమిత ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మాయి గురించి నెట్ లో తెగ వెతికేస్తున్నారు కూడా. మమిత బైజుకి ఇది మొదటి సినిమా కాదు. దీనికంటే ముందు చాలా సినిమాలు చేసింది. కానీ ఏ సినిమాకి రానంత గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది.
కేరళ కొట్టాయంకు చెందిన అమ్మాయి మమిత బైజు. డాక్టర్స్ కుటుంబంలో పుట్టిన మమిత చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఓ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో 2017లో సర్వోపరి పాలక్కారన్ అనే మలయాళ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చింది. దీంతో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఇంట్లో వాళ్ళు డాక్టర్ చదవమన్నా నో చెప్పి సినిమాలని కంటిన్యూ చేస్తుంది. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చేస్తుంది. ఇప్పటికే మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ లీడ్ గా, హీరోయిన్ గా 15 సినిమాలు చేసింది మమిత. ప్రేమలు తన 16వ సినిమా. ఇన్ని సినిమాలతో రాని గుర్తింపు ప్రేమలు సినిమాతో, ముఖ్యంగా తెలుగులో ఓవర్ నైట్ వచ్చేసింది.
ఇక సోషల్ మీడియాలో మమిత కొత్త క్రష్ అంటూ తెగ మీమ్స్, పోస్టులు వేస్తున్నారు. దీంతో మమిత సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగులో తనకు వచ్చిన ఆదరణ చూసి ఇటీవల ఓ ఈవెంట్లో ఎమోషనల్ కూడా అయింది మమిత. మరి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి. ఆమె ఫ్యాన్స్ త్వరగా తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. ఏ డైరెక్టర్ మమిత బైజుకి తెలుగులో అవకాశం ఇస్తాడో చూడాలి. మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పుడు ప్రేమలు సినిమాతో స్టార్ గా మారిపోయింది మమిత.