Harish Shankar : పాపం రోడ్డు మీద ఆగిపోయిన కార్.. తోస్తూ హెల్ప్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత..

తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్, దర్శకుడు హరీష్ శంకర్ వైరల్ అవుతున్నారు.

Harish Shankar : పాపం రోడ్డు మీద ఆగిపోయిన కార్.. తోస్తూ హెల్ప్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత..

Director Harish Shankar and Producer Ravi Shankar helped a Car on road video goes Viral

Updated On : March 14, 2024 / 11:00 AM IST

Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్ళ నుంచి ఎదురుచూస్తున్నా పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్, దర్శకుడు హరీష్ శంకర్ వైరల్ అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి కార్ లో వెళ్తుంటే ఓ చోట రోడ్ మధ్యలో ఆగిపోయిన వేరే కార్ కనిపించింది. దీంతో అక్కడ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఇది గమనించి వెంటనే కార్ దిగి, ఆ ఆడ్రైవెర్ ని ప్రాబ్లమ్ కనుక్కొని డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్, మరికొంతమంది కలిసి ఆ కార్ ని తోశారు. ఆ కార్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

Also Read : Vijay Binni : చిరంజీవి కోసం రాబోతున్న నాగార్జున డైరెక్టర్.. ‘విశ్వంభర’ సినిమాలో..

అంత స్టార్ డైరెక్టర్, నిర్మాతలు అయి ఉండి ఇలా రోడ్ మధ్యలో వేరే వాళ్ళ కార్ ఆగిపోతే తోస్తూ హెల్ప్ చేసారని నెటిజన్లు అభినందిస్తున్నారు.