Premane Oorilo : ‘ప్రేమనే ఊరిలో’ రిలీజ్ డేట్ అనౌన్స్.. కన్నడ హిట్ సినిమా తెలుగులో..
ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. (Premane Oorilo)
Premane Oorilo
Premane Oorilo : మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ప్రేమనే ఊరిలో’. సెప్టెంబర్ 25న కన్నడలో రిలీజయి మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది.
శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ముఖ్య పాత్రల్లో మనోజ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. KGF, కాంతారా సినిమాలకు తెలుగులో డైలాగ్స్ రాసిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు డైలాగ్స్ రాసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Also Read : KTR : ‘ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ రివ్యూ.. గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అంటూ..
ప్రేమనే ఊరిలో సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగులో రిలీజ్ కానుంది. కర్ణాటకలో మంచి విజయం సాధించిన ఈ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

