Prithviraj shetty
Prithviraj shetty : యాంకర్ గా ఫేమ్ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత వైరల్ అయింది విష్ణుప్రియ. ఇప్పుడు టీవీ షోలు, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. విష్ణుప్రియ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు సీరియల్ నటుడు పృథ్వీ రాజ్ శెట్టికి బాగా దగ్గరైంది.(Prithviraj shetty)
బిగ్ బాస్ లో వీళ్ళిద్దరూ లవర్స్ లాగే ప్రవర్తించారు కొన్నిసార్లు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా వీరి బంధం కొనసాగింది. విష్ణుప్రియ గతంలో లవ్ బ్రేకప్స్ చూసాను అని, ఇపుడు పృథ్వీ అంటే ఇష్టం అని అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.
Also Read : Anaganaga Oka Raju : ‘ఆంధ్ర టు తెలంగాణ’.. ‘అనగనగా ఒక రాజు’ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
ప్రస్తుతానికి ఇద్దరం మంచి ఫ్రెండ్స్, అవకాశం ఉంటే పృథ్వీని పెళ్లి చేసుకుంటాను ఏమవుతుందో భవిష్యత్తులో చూడాలి అని విష్ణు చెప్పుకొచ్చింది. పృథ్వీ తల్లి కూడా విష్ణుప్రియ ఓకే అన్నట్టు హింట్ ఇచ్చింది. తాజాగా పృథ్వీశెట్టి విష్ణుప్రియతో పెళ్లిపై స్పందించాడు.
పృథ్వీశెట్టి తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా విష్ణుప్రియతో ఉన్న అనుబంధం ఏంటి, తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.
Also See : Sanjana Galrani : కూతురితో బిగ్ బాస్ సంజన.. టీవీ షోలో సందడి.. ఫొటోలు వైరల్..
దీనికి పృథ్వీశెట్టి సమాధానమిస్తూ.. తను నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ ఇండస్ట్రీలో తనే బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి గురించి అడుగుతుంది కానీ నేను వద్దు అంటాను. నువ్వు ఎవర్ని అయినా మంచోడిని చూసుకొని పెళ్లి చేసుకో బాగుంటావు, నేను వద్దు అన్నాను. పెళ్లి ఎందుకు ఇప్పుడే అని చెప్తాను. కానీ ఆమెకు టైం లేదు ఆమెకు వయసు అయింది. అందుకే వేరే వాళ్ళను చేసుకోమన్నాను అని తెలిపాడు.
ఇదే ఇంటర్వ్యూలో పృథ్వీ విష్ణుప్రియకి కాల్ చేస్తే కాల్ లో కూడా విష్ణు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సరదాగా. విష్ణుప్రియ ఇలా ఇప్పటికే పలుమార్లు పృథ్వీపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టిన పృథ్వీ పెళ్ళికి నో చెప్పడంతో అంత అందమైన అమ్మాయి వస్తే నో చెప్తావేంటి బ్రో అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.