Prithviraj Sukumaran didnt accept role in Prabhas Salaar in beginning
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్రెండ్‌షిప్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ స్నేహితులుగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు ప్రథ్వీరాజ్ ముందుగా నో చెప్పారట. పృథ్వీరాజ్ కోసం ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎదురు చూశారట. ఇంతకీ అసలు ఏమైంది..?
సలార్ నిర్మిస్తున్న నిర్మాతలు మరో మూవీ షూటింగ్ మీద కేరళ వెళ్లారట. ఇక అక్కడ పృథ్వీరాజ్ ని కలిసిన నిర్మాతలు సలార్ మూవీలోని పాత్ర గురించి చెప్పారట. ప్రశాంత్ అప్పుడు కేజీఎఫ్ 2 షూటింగ్ లో ఉండగా.. ఆయనని పిలిపించి మరి కథ వినిపించారట. అయితే పృథ్వీరాజ్ అప్పటికే ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నారు. ఆ మూవీలో పాత్ర కోసం గడ్డం, జుట్టు గుబురుగా పెంచుకొని ఉన్నారట. ఆ సినిమా పూర్తి అయ్యేవరకు తాను మరో మూవీ చేయలేని, సలార్ చేయడం కుదరదని చెప్పారట.
Also read : Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్
కానీ ప్రశాంత్ నీల్ ఎదురు చూస్తాము అని చెప్పారట. దీంతో పృథ్వీరాజ్ డేట్స్ కోసం సలార్ మూవీ టీం వెయిట్ చేసిందట. ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్ లో ఉన్న పృథ్వీరాజ్.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా ఈ మూవీ నుంచి నేడు మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. పూర్తి యాక్షన్ కట్ తో ఉన్న ఈ సెకండ్ ట్రైలర్ మూవీ పై అంచులను మరింత పెంచింది. డిసెంబర్ 22న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ రిలీజ్ కాబోతుంది. ఈ రిలీజ్ కంటే ఒక్క రోజు ముందు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ కనిపించబోతుంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.