“సలార్ 2” షూటింగ్‌పై నటుడు, నిర్మాత, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో మూవీ యూనిట్ పాల్గొంటోంది.
దీంతో హైదరాబాద్‌లో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. సలార్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పారు. “ముందుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి చేయాల్సి ఉంది. నేను కూడా నా కమిట్‌మెంట్లను పూర్తి చేయాల్సి ఉంది.
అలాగే, ప్రభాస్ స్పిరిట్ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. వాటి తర్వాత ప్రభాస్, నేను సలార్ 2 సినిమా షూటింగ్‌లో కలుస్తాం” అని పృథ్వీరాజ్ అన్నారు.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు
సలార్ 1 సినిమా 2023 డిసెంబరు 22న విడుదలైంది. ఆ తర్వాత ప్రభాస్ చాలా సినిమాలకు ఒప్పుకున్నారు. “సలార్ 2” సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
ప్రభాస్ సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా, శ్రుతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో మరో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు.