Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Police Investigation Betting apps case
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పీఎస్ లో విచారించిన ఇన్‌ఫ్లూయెన్సర్స్ నుంచి సేకరించిన సమాచారంతో మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు పేర్కొంటూ పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Also Read: Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు
బెట్టింగ్ కేసులో యాప్స్ నిర్వాహకులే లక్ష్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 19మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ కు నిర్వాహకులే బాధ్యులు అని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వారందరిని నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్లలో కొందరి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. మరికొందరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో వారిని, ఇన్‌ఫ్లూయెన్సర్స్ ను ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతో పాటు తదితరులు ఉన్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురిపై కేసులు నమోదు కాగా.. వారిలో టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు ఇప్పటికే విచారించారు. వైసీపీ మహిళా నేత, టీవీ యాంకర్ శ్యామలను పోలీసులు ఈరోజు పంజాగుట్ట స్టేషన్ లో విచారించారు. మరికొందరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. వారిని కూడా రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది.