MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ..

MLA Raja Singh
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వారిని అడ్డంగా నరుకుతా అంటూ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర రూట్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పైనే తన కొడుకుతో కలిసి పరిశీలించారు. వారివెంట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు ఉన్నారు.
Also Read: MLC Election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక.. షెడ్యూల్ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీలు ఇవే..
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్రను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. శోభయాత్ర జరిగే రూట్ లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్యాచ్ వర్క్, ట్రీ కటింగ్, లైట్లు తదితర వాటిని పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పోలీసులు వల్లనే ఇబ్బంది అవుతుంది.. పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని అధికారులను కోరడం జరిగిందని రాజాసింగ్ అన్నారు.
ఇదిలాఉంటే.. భద్రతా కారణాల రిత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని రాజాసింగ్ ను ఇటీవల పోలీసులు కోరారు. ఈ మేరకు ఆయనకు ఈ నెల 19న హైదరాబాద్ లోని మంగళ్ హట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా రాజాసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి గానీ ఎవరైనా వస్తే అడ్డంగా నరుకుతా అంటూ హెచ్చరించారు. నేను, నా కొడుకు పక్కాగా బైకు నడుపుతాం. పోలీసు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మేము బైక్ పైనే తిరుగుతామని రాజాసింగ్ అన్నారు.