×
Ad

Mallika Sukumaran: నా కొడుకును తొక్కేయాలని చూస్తున్నారు.. ఇంత నీచానికి దిగజారుతారా.. ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీరాజ్‌ తల్లి

తన కొడుకును ఇండస్ట్రీ నుంచి పంపేయాలని చూస్తున్నారు అంటూ పృథ్వీరాజ్‌ తల్లి మల్లిక(Mallika Sukumaran) ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Prithviraj's mother Mallika makes shocking comments on the trolling going on against her son

Mallika Sukumaran: తన కొడుకును ఇండస్ట్రీ నుంచి పంపేయాలని చూస్తున్నారు అంటూ పృథ్వీరాజ్‌ తల్లి మల్లిక(Mallika Sukumaran) ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే, పృథ్వీరాజ్‌ సుకుమారన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ “విలాయత్‌ బుద్ధ”. ఇటీవలే విడుదలైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. అయితే, ఇటీవల ఒక మలయాళ మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్‌ తల్లి మల్లిక ఈ విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Chiranjeevi Charitable Trust: చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. ఎఫ్‌సీఆర్‌ఏ కి గ్రీన్‌ సిగ్నల్‌

“నా కొడుకు పృథ్వీరాజ్‌పై దాడులు జరిగాయి. అప్పుడు చాలా తక్కువమంది అతనికి సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారు. పృథ్వీని పర్సనల్ గా టార్గెట్‌ చేస్తున్నారు. అతను ఎదగడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా అతని కెరీర్‌ నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంత నీచానికి దిగజారుతారని అసలు అనుకోలేదు. ఇప్పటికైనా ఇవన్నీ ఆపకపోతే సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లిక”. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తెలుగులో “వారణాసి” సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు పృథ్వీరాజ్‌. ఇటీవల ఆయనపై చేసిన సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని మేకర్స్ ప్రకటించారు.