Priya Bhavani Shankar : అమ్మకు క్యాన్సర్.. బతికించుకుంటాను అంటూ స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్..
ఇటీవల క్యాన్సర్(Cancer) కి సంబంధించి రోజ్ డే ఉండగా చెన్నైలో అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ కి సంబంధించి ఓ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ముఖ్య అతిధిగా వచ్చింది.

Priya Bhavani Shankar cries on stage in a Cancer Awareness Event
Priya Bhavani Shankar : తాజాగా ఓ హీరోయిన్ స్టేజిపై తన తల్లి గురించి మాట్లాడుతూ ఏడ్చేసింది. ఇటీవల క్యాన్సర్(Cancer) కి సంబంధించి రోజ్ డే ఉండగా చెన్నైలో అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ కి సంబంధించి ఓ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ముఖ్య అతిధిగా వచ్చింది.
ఈ కార్యక్రమంలో ప్రియా మాట్లాడుతూ.. మా అమ్మకి కూడా క్యాన్సర్ వచ్చింది. గత సంవత్సరం తనకు క్యాన్సర్ సోకింది. అప్పుడు నన్ను కూడా టెస్ట్ చేయించుకోమన్నారు. అమ్మకి త్వరగా నయం అయిపోతుందని చెప్తున్నాను. ప్రారంభ దశలోనే క్యాన్సర్ ని గుర్తించి చికిత్స చేస్తున్నాను అమ్మకి. ఈ రోజు ఇక్కడ ఇంతమంది క్యాన్సర్ తో పోరాడుతున్న వారిని చూసి నాకు మరింత ధైర్యం వచ్చింది. మా అమ్మని క్యాన్సర్ నుంచి కాపాడుకుంటాను. వైద్యులపై పూర్తిగా నాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ప్రియా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Ram Pothineni : ఛాన్స్ వస్తే కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా.. మొన్న రామ్ చరణ్, ఇప్పుడు రామ్ పోతినేని..
తమిళ నటి ప్రియా భవాని శంకర్ న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం యాంకర్ గా, సీరియల్స్ లో నటిగా, హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది ప్రియా. తెలుగులో కూడా కళ్యాణం కమనీయం అనే ఓ సినిమాలో కనిపించింది.