Priyadarshi
Priyadarshi : ఇటీవల బన్నీ వాసు మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కావాలని మా సినిమా మీద, మా మీద నెగిటివ్ చేస్తున్నారు. డబ్బులిచ్చి మరీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, తొక్కాలని చూస్తున్నారు అని సంచలన కామెంట్స్ చేసారు. దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ అయి టాలీవుడ్ లో చర్చగా మారాయి.(Priyadarshi)
నేడు ప్రియదర్శి మళ్ళీ దీనిపై స్పందించాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడారు.
Also Read : Mithra Mandali : ‘మిత్ర మండలి’ థియేట్రికల్ బిజినెస్ ఇంతేనా? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..
ప్రియదర్శి బన్నీ వాసు మాట్లాడిన విషయం పై స్పందిస్తూ.. నేను కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ చూసాను. నిజమే చెప్తున్నా. కొంతమంది ఊరు పేరు లేని వాళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు. హేట్ చేస్తున్నారు టార్గెటెడ్ గా. నన్ను క్రిటిసైజ్ చేస్తే తీసుకుంటాను కానీ హేట్ చేస్తున్నారు. తొక్కాలి, కిందకు లాగాలి అని చాలా మందిని చేస్తున్నారు. మా వీడియోల కింద కామెంట్స్ లో నెగిటివ్ గా పెట్టారు. అది చూసి బాధపడ్డాం. అయినా దాని మీదే కామెడీగా వీడియో చేసాము.
ఇది చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఒకే ఐపి అడ్రెస్ తో 300 మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారంటే. పేరు ఊరు లేకుండా ఏదో ఒక అకౌంట్ క్రియేట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు తెలీదు. నేను మొదటిసారి ఇంత నెగిటివ్ చేస్తున్నాను. మొదట షాక్ అయ్యాను తర్వాత బాధపడ్డాను అని అన్నారు. దీంతో అసలు ప్రియదర్శి మీద నెగిటివిటి ఎందుకు వచ్చింది? అతని సినిమాకు నెగిటివిటి ఎవరు చేస్తున్నారు అని చర్చగా మారింది.
Also Read : Raviteja : రవితేజ ఫ్యాన్స్ కి నిరాశే.. మాస్ జాతర సినిమా టైంకి..