అసురన్ రీమేక్: భార్యగా ప్రియమణి.. కొడుకుగా హీరో.. మరదలిగా?

  • Published By: vamsi ,Published On : January 4, 2020 / 03:04 AM IST
అసురన్ రీమేక్: భార్యగా ప్రియమణి.. కొడుకుగా హీరో.. మరదలిగా?

Updated On : January 4, 2020 / 3:04 AM IST

తమిళ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా అసురన్. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్మాతలు. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి నటీనటులను సెలెక్ట్ చేస్తుంది చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఇందులో హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ భార్య పాత్రలో ఆమె నటించనుంది.  మరో హీరోయిన్(మరదలి పాత్రలో) ఎవరు నటిస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా కోసం మొదట శ్రీయ అనుకున్నప్పటికీ, రష్ లుక్‌లో ప్రియమణి అయితే కరెక్ట్‌గా సరిపోతుందని చిత్రయూనిట్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇందులో ముఖ్యమైన కొడుకు పాత్ర కోసం హీరోని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తుంది. అందుకోసం ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. నటీనటులు అందరినీ ఎంపిక చేసిన తర్వాత త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనుంది చిత్రయూనిట్. తమిళంలో ‘అసురన్’ సినిమాలో ధనుష్ నటించాడు. 2019లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టింది.