మీకు నచ్చినట్టు జీవితాన్ని గడపండి – ప్రియాంక ఆసక్తి కరమైన పోస్ట్
జీవితం గురించి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన పోస్ట్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది..

జీవితం గురించి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన పోస్ట్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది..
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రెండు కొద్ది రోజుల క్రితం ఓ అవార్డ్స్ పంక్షన్‌లో వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యాషనబుల్‌గా ఉండటం తప్పు కాదు.. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకోవచ్చు కానీ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేటప్పుడు మాత్రం ఇలాంటి దుస్తులు ధరించి ఉండాల్సింది కాదు.. అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతుండగా.. నటి సుచిత్రా కృష్ణమూర్తి వంటి వాళ్లు ప్రియాంకకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు.
ఇక తాజాగా ప్రియాంక చోప్రా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘ ఈ సంవత్సరం ప్రారంభంలో ఏదో ఉంది అని నేను ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది, మనం జనవరిలో మాత్రమే ఉన్నాము. మీరు ఇష్టపడే వారిని ప్రేమించండి. మీరు జీవించాలనుకుంటున్న జీవితాన్ని గడపండి … మీతో మరియు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దయ చూపండి. నేను అందుకున్న దయకు నేను చాలా కృతజ్ఞురాలిని.. జీవితం ఒక గొప్ప బహుమతి’’ అంటూ ప్రియాంక చేసిన పోస్ట్‌కి నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తోంది.
Read Also : ఫోన్లో చుక్కలు చూపిస్తున్నారు – ‘కరాటే’ కళ్యాణి ఫిర్యాదు
రాజ్ కుమార్ రావుతో కలిసి ‘వైట్ టైగర్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న పీసీ ‘క్వాంటికో’ టివి సిరీస్, ‘బేవాచ్’ మూవీ తర్వాత ‘మ్యాట్రిక్స్’ సిరీస్‌లో రాబోతున్న నాలుగో చిత్రం ‘మ్యాట్రిక్స్ 4’ లో నటించనుందని తెలుస్తోంది. లానా వాచోవ్‌స్కీ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2021 మే 21న ‘మ్యాట్రిక్స్ 4’ విడుదల కానుంది.