Priyanka Chopra : నేను, నా భర్త పెళ్ళికి ముందు చాలా మందితో డేటింగ్ చేశాం.. కానీ గతం అనవసరం..
తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వారి పాత రిలేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.

Priyanka Chopra sensational comments on her past relations and Nick Jonas
Priyanka Chopra : బాలీవుడ్(Bollywood) లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి హాలీవుడ్ కి చెక్కేసింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అక్కడే హాలీవుడ్(Hollywood) లో వరస సినిమాలు చేస్తూ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas) ని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది ప్రియాంక చోప్రా. ఇటీవల వరుస హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇక వాటి ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనేక ఆసక్తికర అంశాలను మాట్లాడి ప్రియాంక చోప్రా ఇటీవల వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వారి పాత రిలేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను నిక్ జోనస్ ని కలవడానికి ముందు కొంతమందిని ప్రేమించాను. కొంతమందితో డేటింగ్ చేశాను. నటిగా చాలా బిజీగా ఉండేదాన్ని. కొన్ని కారణాల వల్ల నా రిలేషన్ షిప్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ నేను డేటింగ్ చేసిన వాళ్లంతా మంచోళ్ళే. నిక్ జోనస్ ముందు, నా చివరి బ్రేకప్ మధ్య మాత్రం చాలా గ్యాప్ ఉంది. లైఫ్ లాంగ్ ఒక బంధంలో అడుగు పెట్టడానికి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నిక్ జోనస్ కు ప్రియుడిగా కాకుండా భర్తగా ప్రమోషన్ ఇచ్చాను. పెళ్లి చేసుకునేముందు అతనితో కొన్నాళ్ళు డేటింగ్ చేశాను. అతడు కూడా నా కంటే ముందు చాలా మందిని ప్రేమించాడు, చాలా మందితో డేటింగ్ చేశాడు. అదంతా గతం. అయిపోయిన దానిగురించి తవ్వడం అనవసరం. ప్రస్తుతం మా రిలేషన్ బాగుంది. తనతోనే జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అని తెలిపింది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. పవర్ స్టార్ లుక్ అదిరిందిగా..
దీంతో ఇలా డేరింగ్ గా ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వాళ్లకు ఉన్న పాత రిలేషన్స్ గురించి మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి 2018 లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారికి ఒక కూతురు కూడా ఉంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలతో బిజీగా అంటూనే తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.