Priyanka Chopra supports Hollywood Screen Actors Guild Strike shares a post in Instagram
Priyanka Chopra : హాలీవుడ్ లో ఓ పక్కన రైటర్స్ సమ్మె జరుగుతుండగానే నిన్నటి(జులై 14) నుంచి యాక్టర్స్ అసోసియేషన్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ SAG (Screen Actors Guild) కూడా సమ్మెకు దిగింది. నిర్మాణ సంస్థల యూనియన్ అయిన AMPTP (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ స్టార్ యాక్టర్స్ కాకుండా దాదాపు 80 శాతం మంది యాక్టర్స్ సమ్మెలోకి దిగారు.
రైటర్స్ కోరుకుంటున్న డిమాండ్స్ యాక్టర్స్ కూడా కోరుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు మంచి లాభాలు ఆర్జిస్తున్నా సరైన వేతనాలు ఇవ్వట్లేదని, సినిమాకు ప్రాఫిట్స్ వస్తున్నా మా రెమ్యునరేషన్స్ ఇవ్వట్లేదని, సినిమా నిర్మాణంలో AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్రని తగ్గించాలని, హెల్త్, ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వట్లేదని, షూటింగ్ లో సరైన సదుపాయాలు కూడా కలిపించట్లేదని చెప్తూ సమ్మెకు దిగారు. ఈ మేరకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ ప్రెస్ మీట్ పెట్టి స్ట్రైక్ అనౌన్స్ చేశారు. రైటర్స్ గిల్డ్ అమెరికా సమ్మెకు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చారు.
Nag Ashwin : ప్రాజెక్ట్ K టైటిల్ కవర్‌తో నాగ్ అశ్విన్.. పూజ చేయించి.. చాలా బరువుగా ఉందంటూ పోస్ట్..
తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మెకు ప్రియాంక చోప్రా మద్దతు ఇచ్చింది. ప్రియాంక చోప్రా ఇండియా నుంచి వెళ్లినా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే ఉంటుంది. దీంతో ప్రియాంక చోప్రా కూడా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లో సభ్యత్వం తీసుకున్నట్టు సమాచారం. తాజాగా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ స్ట్రాంగ్ అంటూ ఫోటో పెట్టి.. నా యూనియన్, నా తోటి నటులకు మద్దతుగా నిలుస్తున్నాను. ఒక మంచి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ప్రియాంక పోస్ట్ వైరల్ గా మారింది.