Nag Ashwin : ప్రాజెక్ట్ K టైటిల్ కవర్‌తో నాగ్ అశ్విన్.. పూజ చేయించి.. చాలా బరువుగా ఉందంటూ పోస్ట్..
తాజాగా నాగ్ అశ్విన్ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఒక కవర్ ని పూజ చేయించి ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..

Nag Ashwin special post on Project K Movie title
Nag Ashwin Project K : ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా అనేకమంది స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల సినిమా నుంచి ఏదో ఒక వరుస అప్డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది చిత్రయూనిట్. త్వరలో ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ లో కూడా పాల్గొనబోతుంది. జులై 20న ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమాకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో గత రెండు రోజులుగా ప్రాజెక్ట్ K గురించి రోజు ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Project K : ఊపిరి పీల్చుకో అమెరికా.. ఇండియన్ బిగ్ స్టార్స్ ప్రభాస్, కమల్ వస్తున్నారు..
తాజాగా నాగ్ అశ్విన్ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఒక కవర్ ని పూజ చేయించి ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఈ కవర్ లో కేవలం ఒక పేపర్ ఒక సింగిల్ వర్డ్ తో ఉంది. కానీ ప్రపంచమంతా బరువు ఈ కవర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రాజెక్ట్ K సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ పెట్టడంతో టైటిల్ ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నారు. ఒక్క వర్డ్ లోనే టైటిల్ ఉంటుందని నాగ అశ్విన్ హింట్ కూడా ఇచ్చేశాడు. కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ K టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జులై 20న అమెరికాలో అంటే జులై 21న ఇండియాలో టైటిల్ రివీల్ కానుంది.