Priyanka Jawalkar : విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాను అని ఎవ్వరికి చెప్పలేదు.. భయమేసింది..
మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రియాంక జవాల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

Priyanka Jawalkar Interesting Comments on Vijay Deverakonda Taxiwala Movie
Priyanka Jawalkar : తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తక్కువే. అలాంటి తెలుగు హీరోయిన్స్ లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత SR కల్యాణమండపంతో మంచి హిట్ అందుకుంది. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రియాంక జవాల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపింది.
Also Read : Peddi Glimpse : పుష్ప 2, దేవర రికార్డ్ లు బద్దలుకొట్టిన రామ్ చరణ్ ‘పెద్ది’.. 24 గంటల్లోపే..
ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. నేను సినిమాలు ట్రై చేస్తున్నాను అని ఇంట్లో తెలుసు. ఇంట్లో వాళ్ళు తనకు నచ్చింది చేసుకోనివ్వు అని ఏమన్లేదు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాలో ఛాన్స్ వచ్చాక ఒక వారం రోజులు షూటింగ్ అయ్యేదాకా కూడా ఎవ్వరికి చెప్పలేదు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అది. పెద్ద కంపెనీ, నాకు మొదటి సినిమా. సినిమాలో ఉంటానో, మధ్యలో తీసేస్తారో అని ఒక భయం ఉండేది. అందుకే షూట్ మొదలయి ఒక వారం రోజులు షూట్ అయ్యాకే నేనే సినిమాకి హీరోయిన్ అని నాకు అనిపించాక ఇంట్లో చెప్పాను. అప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఆ తర్వాతే అందరికి చెప్పాను అని తెలిపింది.