Peddi Glimpse : పుష్ప 2, దేవర రికార్డ్ లు బద్దలుకొట్టిన రామ్ చరణ్ ‘పెద్ది’.. 24 గంటల్లోపే..
ఈ గ్లింప్స్ తోనే పెద్ది రికార్డుల వేట మొదలయింది.

Ram Charan Peddi Glimpse Beats Allu Arjun Pushpa 2 and NTR Devara Glimpse Records
Peddi Glimpse : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి నిన్న శ్రీరామ నవమి నాడు గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచారు. ఈ గ్లింప్స్ తోనే పెద్ది రికార్డుల వేట మొదలయింది. రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ ఒక్క తెలుగులోనే 24 గంటల్లోపే 30 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇక అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్స్ దాటింది.
ఈ వ్యూస్ 24 గంటలలోపే వచ్చేసాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పెద్ది గ్లింప్స్ వ్యూస్ తో అల్లు అర్జున్ పుష్ప 2, దేవర రికార్డులను బద్దలు కొట్టాడు. అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ గ్లింప్స్ 24 గంటల్లో 27.6 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి. ఎన్టీఆర్ దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్ 26 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి. మహేష్ గుంటూరు కారం గ్లింప్స్ 21 మిలియన్స్ వ్యూస్ సాధించాయి. పుష్ప 2 తెలుగు గ్లింప్స్ కూడా 20 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించాయి.
ఈ రికార్డులు వ్యూస్ అన్ని 24 గంటల్లోపే భారీ తేడాతో పెద్ది గ్లింప్స్ సాధించడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొడుతుందో చూడాలి. అయితే పాన్ ఇండియా వైడ్ చూస్తే మాత్రం యష్ టాక్సిక్ గ్లింప్స్ 36 మిలియన్స్ వ్యూస్ తో ఫస్ట్ ప్లస్ లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ పుష్ప 2 ని బీట్ చేసి రెండో ప్లేస్ లో నిలిచింది.