Proddatur Dussehra
Proddatur Dussehra : బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాణంలో మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. ఇటీవల ఈ డాక్యుమెంటరీ థియేటర్స్ లో రిలీజవ్వగా నవంబర్ 7న ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.(Proddatur Dussehra)
ఈ డాక్యుమెంటరీలో ఏం చుపించారంటే.. మహాభారతం విరాట పర్వంలో జమ్మిచెట్టు మీద ఆయుధాలను పాండవులు దాచడం, తర్వాత ఆ ఆయుధాలతో కురుక్షేత్ర యుద్ధం గెలవడం, జమ్మిచెట్టు ప్రాముఖ్యతని చూపించడంతో డాక్యుమెంటరీని మొదలుపెట్టారు. ఇదంతా AI విజువల్స్ తోనే చూపించారు. అనంతరం దసరా ఒక్కో రాష్ట్రం ఒక్కో లాగా చేసుకుంటుందని, మైసూరు తర్వాత దసరాని సీమలోని ప్రొద్దుటూరులోనే ఘనంగా చేస్తారని చెప్పుకొచ్చారు. అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు అనే కథని సింపుల్ గా AI విజువల్స్ తో చూపించారు.
అనంతరం ప్రొద్దుటూరులో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా దసరా చేస్తారని ఆ ఆలయం గురించి, 150 ఏళ్ళ దాని చరిత్రని చెప్పారు. 150 ఏళ్ళ క్రితం కొండయ్య అనే వ్యక్తి కలలోకి కన్యకాపరమేశ్వరి వచ్చి ఆలయం కట్టమనగా ప్రొద్దుటూరులో ఆలయం ప్రారంభించాడు. కానీ అది పూర్తవ్వకముందే ఆయన చనిపోవడంతో అక్కడి వైశ్యులు ఆ ఆలయ బాధ్యత తీసుకొని జాతర నిర్వహించి వచ్చిన డబ్బులతో ఆలయాన్ని పూర్తిచేశారని చెప్పారు. ఇదంతా కూడా AI , గ్రాఫిక్స్ విజువల్స్ తోనే చూపించారు.
అనంతరం ఆ ఆలయంలో దసరా తొమ్మిది రోజులు ఎలా చేస్తారు? అక్కడ ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఆ ఊళ్ళో ఉన్న వేరే ఆలయాల గురించి చూపించారు. అలాగే ప్రొద్దుటూరు బంగారు ఆభరణాలు ఫేమస్ అని చెప్పుకొచ్చారు. ఆ ఊళ్లోని పలువురితో మాట్లాడించారు. కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా ప్రొద్దుటూరు కావడంతో ఆయన కూడా తమ ఊళ్ళో దసరా గురించి మాట్లాడారు.
విశ్లేషణ.. అయితే చాలా సీన్స్ AI విజువల్స్, గ్రాఫిక్స్ తో చూపించి వాయిస్ ఓవర్ తోనే నడిపించారు. తొమ్మిది రోజులు దసరాని సింపుల్ గా చూపించారు కానీ ఇంకా క్లారిటీగా అక్కడ ఏమేం కార్యక్రమాలు, ఎలా చేస్తారు అనేది చూపించే అవకాశం ఉన్నా చూపించలేదు. ఆలయం గురించి గొప్పగా చెప్పారు కానీ అమ్మవారి మూల విరాట్ మాత్రమే చూపించారు. ఆలయం విజువల్స్ ఎక్కువగా చూపించలేదు. ఆ ఊరు దసరా గురించి పలువురితో మాట్లాడించగా వాళ్ళ మాటలు లిప్ సింక్ లేవు. మొదట వీడియో తీసి తర్వాత డబ్బింగ్ చెప్పించినట్టు ఉంది. ఈ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. ప్రొద్దుటూరు దసరా పై ఓ సాంగ్ ని కూడా పాడించారు.
అయితే ఈ డాక్యుమెంటరీని ఇంకా అందంగా, ఇంకా విశదీకరించి చూపించే అవకాశం ఉన్నా సింపుల్ గా ముగించేశారని అనిపించింది. చరిత్ర చెప్పడానికి ఎక్కువగా AI విజువల్స్ వాడటంతో రియాల్టీ మిస్ అయింది అనిపిస్తుంది. ఆలయం గురించి, ఆలయంలో జరిగే పూజలు, ఊరేగింపులు ఇంకా విజువల్స్ పరంగా చూపిస్తే బాగుండేది. అలాగే ఈ డాక్యుమెంటరీని దీపావళికి అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ చేసి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసారు. కనీసం దసరా టైంలో రిలీజ్ చేసినా ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చి ఉండేదేమో.
Also Read : NTR : తెల్లారితే ఎన్టీఆర్ ముందు డ్యాన్స్ చేయాలి.. కానీ వీల్ చైర్ లో రాజు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..
గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.