Gautam Ghattamaneni
Gautam Ghattamaneni : మహేష్ తనయుడు గౌతమ్ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలిసిందే. గౌతమ్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్, సినిమాకు సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నాడు. గౌతమ్ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా గౌతమ్ ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు.(Gautam Ghattamaneni)
తాజాగా గౌతమ్ గురించి నిర్మాత అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అనిల్ సుంకర నిర్మాణంలో మహేష్ బాబు దూకుడు, ఆగడు, వన్ నేనొక్కడ్నే సినిమాలు చేసారు.
Also See : ముగ్గురు హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్‌లో.. దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్.. ఫొటోలు వైరల్..
అనిల్ సుంకర తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కృష్ణ గారికి వీరాభిమాని. ఆయన నాతో బాగా మాట్లాడేవారు. నేను, మహేష్ కూడా చాలా క్లోజ్. మహేష్ అబ్బాయి గౌతమ్ మా అబ్బాయి కూడా క్లోజ్. గౌతమ్ ని ఎవరు హీరోగా ఇంట్రడ్యూస్ చేసినా నా సపోర్ట్ ఉంటుంది. అతను సక్సెస్ అవ్వాలి. నాకు ఆ ఛాన్స్ ఇస్తే కచ్చితంగా చేస్తాను. కానీ బెస్ట్ స్టోరీ ఎవరు ఇస్తే వాళ్ళతో చేస్తేనే బెటర్. గౌతమ్ ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వాలి. అది నా కోరిక. ఒకవేళ అది నా నిర్మాణంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని తెలిపారు.
గౌతమ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి నిర్మాతలు అయితే రెడీగా ఉన్నారు. మరి గౌతమ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
Also Read : Music Director Koti : నాకు చాలా సినిమాలకు నంది అవార్డు రావాలి.. కానీ ఇవ్వలేదు.. కోటి వ్యాఖ్యలు..