Music Director Koti : నాకు చాలా సినిమాలకు నంది అవార్డు రావాలి.. కానీ ఇవ్వలేదు.. కోటి వ్యాఖ్యలు..

రాజ్ - కోటి ద్వయం సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఇచ్చారు.(Music Director Koti)

Music Director Koti : నాకు చాలా సినిమాలకు నంది అవార్డు రావాలి.. కానీ ఇవ్వలేదు.. కోటి వ్యాఖ్యలు..

Music Director Koti

Updated On : January 18, 2026 / 9:00 PM IST

Music Director Koti : 90s, 2000 దశాబ్దంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పించారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి. ఇప్పటికీ ఆయన పాటలు తెలుగు ఇళ్లల్లో వినిపిస్తూనే ఉంటాయి. మాస్, మెలోడీ.. అన్ని రకాల సాంగ్స్ ని అందించారు. రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఇచ్చారు.(Music Director Koti)

అయితే సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన కోటికి ఒకటే నంది అవార్డు రావడం గమనార్హం. నాగార్జున హలో బ్రదర్ సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కోటికి వరించింది. అది కూడా రాజ్ తో కలిసి అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు నంది అవార్డు మళ్ళీ రాలేదు.

Also See : Shivathmika Rajashekar : చీరకట్టులో శివాత్మిక ఎంత అందంగా ఉందో.. ఫొటోలు..

తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి దీనిపై స్పందిస్తూ.. నాకు హలో బ్రదర్ సినిమాకు నంది అవార్డు వచ్చింది. నాకు చాలా సినిమాలకు ఇవ్వాలి నంది అవార్డు. నువ్వు నాకు నచ్చవు, నువ్వే కావలి, మల్లీశ్వరి.. ఇలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. కానీ వాటికి నంది అవార్డు ఇవ్వలేదు.

అయినా నేను పట్టించుకోలేదు. నంది అవార్డు రాలేదని బాధపడలేదు. నేను అవార్డు కోసం మ్యూజిక్ చేయలేదు. జనాల కోసం మ్యూజిక్ చేశాను. నా మ్యూజిక్ కలకాలం ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. అది ఆలోచించి మ్యూజిక్ చేస్తాను కానీ అవార్డుల కోసం కాదు అని అన్నారు.

Also Read : Anil Sunkara : మహేష్ వన్ నేనొక్కడ్నే సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే.. నిర్మాత కామెంట్స్ వైరల్..