C Kalyan : మహేష్ ఫ్యాన్స్ వల్లే ‘ఖలేజా’ నాశనమైంది.. తాగేసి నాకు, త్రివిక్రమ్ కి ఫోన్ చేసి బూతులు తిట్టారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
ఇపుడు ఖలేజా సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

Producer C Kalyan Sensational Comments on Mahesh Babu Fans Regarding Khaleja Re Release
C Kalyan : మహేష్ బాబు కెరీర్లో క్లాసిక్ సినిమాల్లో ఒకటి ఖలేజా. అయితే ఈ సినిమా రిలీజయిన సమయంలో ఫ్లాప్ అయింది. మహేష్ కామెడీ టైమింగ్, దేవుడి కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో అప్పటి ప్రేక్షకులకు సినిమా అర్థంకాలేదు. కానీ తర్వాత ఖలేజా సినిమా అందరికి నచ్చి, ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అందులో సీన్స్ బాగా వైరల్ అయి క్లాసిక్ గా నిలిచింది.
ఇపుడు ఖలేజా సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మే 30న రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు సినిమాని ఫ్లాప్ చేసిన మహేష్ అభిమానులు ఇప్పుడు రీ రిలీజ్ లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా ఖలేజా సినిమా నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..
ఖలేజా రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఖలేజా సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. అప్పుడు సినిమా వాళ్లకు అర్ధం కాలేదు. మమ్మల్ని తిట్టారు. రాత్రి షో అయ్యాక తాగేసి నాకు, త్రివిక్రమ్ కి ఫోన్ చేసి బూతులు తిట్టారు. వాళ్ళే సినిమాని అప్పుడు సర్వనాశనం చేసారు. కానీ ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత అదే ఫ్యాన్స్ రీ రిలీజ్ చేయమని అడిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమా వాళ్ళకు ఇప్పుడు అర్ధం అయింది. అదే ఫ్యాన్స్ రీ రిలీజ్ లో మళ్ళీ స్క్రీన్ మీద సినిమా చూసి మమ్మల్ని తిట్టిన వాళ్ళు తప్పు చేశామని ఫీల్ అవుతారు అని అన్నారు. దీంతో నిర్మాత వ్యాఖ్యలు సంచలనంగా మారగా ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
Also Read : OG Movie : మళ్ళీ OG షూట్ కి బ్రేక్.. కానీ ఈసారి పవన్ వల్ల కాదు.. చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందా?