HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..

హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..

Pawan Kalyan HariHara VeeraMallu Movie Trailer Releasing Date

Updated On : May 29, 2025 / 9:49 AM IST

HariHara VeeraMallu : అయిదేళ్లుగా సాగుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తవడంతో రిలీజ్ కి రెడీ చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ట్రైలర్ జూన్ 2న రిలీజ్ కానుందని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై కూడా ప్లే చేస్తారట. ఇదే కనక జరిగితే ఇప్పటివరకు బుర్జ్ ఖలీఫా పై బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ జరిగాయి కానీ టాలీవుడ్ లో మొదటి సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు.

Also Read : Nara Rohith : నాకు కాబోయే భార్య పవన్ OG సినిమాలో నటించింది..

పవన్ చేస్తున్న మొదటి పీరియాడికల్ సినిమా, పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, మరోసారి ఈ సినిమాలో పవన్ ఫైట్ కంపోజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ట్రైలర్ వచ్చాక సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెరుగుతాయో చూడాలి.