×
Ad

Dil Raju: క్రేజీ టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కోసమేనా.. డైరెక్టర్ ఎవరంటే.?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ్ముడు సినిమాతో ఆయనపై ఆ ఇష్టం మొదలయ్యింది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు దిల్ రాజు.

Producer Dil Raju has registered Arjuna title for Pawan Kalyan.

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ్ముడు సినిమాతో ఆయనపై ఆ ఇష్టం మొదలయ్యింది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు దిల్ రాజు(Dil Raju). నిజానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ దాదాపు 20 ఏళ్లుగా ఎదురుచూశాడు దిల్ రాజు. ఆ కోరిక వకీల్ సాబ్ తో నెరవేరింది అని చెప్పాలి. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాజకీయలకు వెళ్ళిపోయాడు ఇక సినిమాలు చేయడు అనుకునే సమయంలో పవన్ మళ్ళీ వకీల్ సాబ్ తో అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విషయంలో దిల్ రాజుపై ప్రేమను చూపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

MM Keeravani: వారణాసి మ్యూజికల్ అప్డేట్.. సాంగ్స్ గురించి చెప్పిన కీరవాణి.. ఫ్యాన్స్ కి ఫుల్ పండగ

ఇక ఓజీ సక్సెస్ మీట్ లో కూడా దిల్ రాజు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేయాలనీ కోరాడు. ఆ తరువాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరొ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ వేణునే ఈ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ, దిల్ రాజు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా ఈ న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే, నిర్మాత దిల్ రాజు ఇటీవల “అర్జున” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడట.

దీంతో ఈ టైటిల్ ను పవన్ కళ్యాణ్ కోసమే రిజిస్టర్ చేయించారు అంటూ న్యూస్ వస్తున్నాయి. ఈ టైటిల్ కి తగ్గట్టుగా కథ కూడా ఇప్పటికే రెడీ అయ్యింది అని తెలుస్తోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టుకి దర్శకుడిగా శ్రీరామ్ వేణు ఉంటాడా లేక వంశీ పైడిపల్లి ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఏ దర్శకుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తాడు.. అర్జున అనే టైటిల్ పవన్ కోసమే రిజిస్టర్ చేయించారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నిర్మాతలు ఇటీవలే తెలిపారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.