మహేష్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. వారణాసి సాంగ్స్ పై ఎంఎం కీరవాణి లీక్..

రాజమౌళి అన్న ఎంఎం కీరవాణి(MM Keeravani) ఆయన ప్రతీ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. ఇక వారణాసి సినిమాకు కూడా ఆయనే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

మహేష్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్..  వారణాసి సాంగ్స్ పై ఎంఎం కీరవాణి లీక్..

Keeravani made interesting comments about Varanasi music

Updated On : November 22, 2025 / 10:39 AM IST

MM Keeravani: దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘వారణాసి’. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ హిట్స్ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో విడుదల చేసిన వారణాసి టీజర్, మహేష్ బాబు లుక్ కి ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ వచ్చింది.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే.. ఇక థియేటర్స్ లో శివతాండవమే

2027 మర్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు మ్యూజిక్ ప్రధాన భలం అనే చెప్పాలి. రాజమౌళి అన్న ఎంఎం కీరవాణి(MM Keeravani) ఆయన ప్రతీ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. ఇక వారణాసి సినిమాకు కూడా ఆయనే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన వారణాసి థీమ్ మ్యూజిక్ కి,  కుంభ సాంగ్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వారణాసి సినిమా మ్యూజిక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు కీరవాణి.

ఇటీవల ఆయన గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ..’వారణాసి సినిమా మ్యూజిక్ ఊహకు అందని రేంజ్ లో ఉంటుంది. తప్పకుండా అద్భుతమైన సంగీతాన్ని వింటారు. అంతకు మించి ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నాయి. చేసే పనిపై మనకు స్పష్టత, మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు ఎలాంటి గందరగోళం, ఒత్తిడి ఉండదు. వారణాసి విషయంలో కూడా నాకు ఎలాంటి గందరగోళం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు కీరవాణి.