Producer Kedar Selagamsetty : టాలీవుడ్‌లో విషాదం.. గంగం గ‌ణేశా చిత్ర నిర్మాత క‌న్నుమూత‌

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది.

Producer Kedar Selagamsetty Passed Away in Dubai

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి క‌న్నుమూశారు. ఈయ‌న ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా గంగం గ‌ణేశా చిత్రాన్ని తెర‌కెక్కించారు. దుబాయ్‌లో కేదార్ మ‌ర‌ణించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలుసుకున్న మిత్రులు, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసులకు కేదార్ సెలగంశెట్టి స‌న్నిహితుడుగా తెలుస్తోంది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి అనుకున్నారు.

Raviteja : రవితేజ ‘ధమాకా’ సీక్వెల్..? టైటిల్ కూడా లీక్ చేసేసిన డైరెక్టర్.. ఏంటో తెలుసా?

ఈ క్ర‌మంలో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ మూవీని సైతం ప్ర‌క‌టించారు. అయితే.. హ‌ఠాత్తుగా ఆయ‌న మ‌ర‌ణించార‌ని తెలియ‌డంతో స్నేహితులు, స‌న్నిహితులు షాక్‌కు గురి అవుతున్నారు.