Raviteja : రవితేజ ‘ధమాకా’ సీక్వెల్..? టైటిల్ కూడా లీక్ చేసేసిన డైరెక్టర్.. ఏంటో తెలుసా?
మాస్ మహారాజ రవితేజ 2022 లో ధమాకా సినిమాతో చివరగా హిట్ కొట్టాడు.

Raviteja Dhamaka Movie Sequel Title Revealed by Director Trinadha rao Nakkina
Raviteja : మాస్ మహారాజ రవితేజ 2022 లో ధమాకా సినిమాతో చివరగా హిట్ కొట్టాడు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ మళ్ళీ ఇప్పటిదాకా హిట్ కొట్టలేదు. త్వరలో మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
అయితే ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇప్పుడు మజాకా సినిమాతో రాబోతున్నాడు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా రావు రమేష్, మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ముఖ్య పాత్రల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మజాకా సినిమా రేపు ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ నేడు మీడియాతో మాట్లాడుతూ మజాకా సినిమాతో పాటు తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.
Also Read : Jyotika : 46 ఏళ్ళ వయసులో.. ఇంత స్టైలిష్ గా.. ఇంత అందంగా.. జ్యోతిక ఫోటోలు చూశారా..
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. మజాకా సినిమాకు కూడా సీక్వెల్ అనుకున్నాము. డబల్ మజాకా అనే టైటిల్ అనుకున్నాము. సినిమా చివర్లో టైటిల్ వేద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి ఆపేశాం అని అన్నారు. అలాగే రవితేజ గారికి ఒక కథ చెప్పాను. ధమాకాకి మించి ఉంటుంది. దానికి కూడా డబల్ ధమాకా అనే టైటిల్ అనుకుంటున్నాము. మజాకా రిలీజ్ అయ్యాక ముందు డబల్ మజాకా చేస్తానా, డబల్ ధమాకా చేస్తానా నిర్మాతలతో మాట్లాడి డిసైడ్ అవ్వాలి. రవితేజ గారికి ఆల్రెడీ కథ వినిపించాను, ఆయన ఓకే అన్నారు అని తెలిపారు.
Also Read : NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..
దీంతో ధమాకా సీక్వెల్ అయినా కాకపోయినా రవితేజతో త్రినాథరావు నక్కిన తేజ్ సినిమాకు డబల్ ధమాకా అనే టైటిల్ ఉంటుందని రివీల్ చేసేసారు. అయితే మజాకా తర్వాత సందీప్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ మాత్రం మాస్ జాతర తర్వాత ఇంకా ఏ సినిమా అనౌన్స్ చేయలేదు కాబట్టి ముందు రవితేజ – త్రినాథరావు నక్కిన సినిమానే ఉంటుందని, రవితేజకు మరో హిట్ అని భావిస్తున్నారు. మరో డబల్ ధమాకాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా ఉంటుందా చూడాలి.