Rashmika Marriage : తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుంది.. రష్మిక పెళ్లిపై నిర్మాత కామెంట్స్..

తాజాగా నిర్మాత నాగవంశీ రష్మిక పెళ్లి గురించి కామెంట్స్ చేసారు.

Producer Naga Vamsi Comments on Rashmika Mandanna Marriage

Rashmika Marriage : రష్మిక మందన్న ప్రస్తుతం ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. ఇక రష్మిక పెళ్లి, ప్రేమ విషయాల్లో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశితార్థం చేసుకొని రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండతోనే ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

Also Read : Ram Charan – Balakrishna : బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ కి చరణ్ తో పాటు ఇంకో ముగ్గురు.. ఎవెరెవరో తెలుసా? చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్..

రష్మిక, విజయ్ కలిసి వెకేషన్స్ కి, పార్టీలకు, బయట హోటల్స్ కి వెళ్తూ అనేకసార్లు కెమెరాల కంట పడ్డారు. ఇటీవల కూడా ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తూ కనపడ్డారు. ఇక రష్మిక అయితే ఏ పండగ వచ్చినా విజయ్ ఇంట్లో వాలిపోతుంది. దీంతో రష్మిక – విజయ్ ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇటీవల పుష్ప ఈవెంట్లో రష్మిక పెళ్లి గురించి అడిగితే మీ అందరికి తెలుసు కదా అని కామెంట్స్ చేసింది. తాజాగా నిర్మాత నాగవంశీ రష్మిక పెళ్లి గురించి కామెంట్స్ చేసారు. డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాప‌బుల్‌ షోకి రాగా బాలయ్య నాకు రష్మిక అంటే క్రష్, రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అన్నారు.

Also Read : Prabhas : డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ అవగాహన కోసం ప్రభాస్ చేసిన వీడియో చూశారా?

దీనికి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని చెప్పడంతో ఆ హీరో విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని వాళ్ళ చర్యలే హింట్స్ ఇస్తుండగా ఇప్పుడు నాగవంశీ తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని చెప్పడంతో మరోసారి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అని, పెళ్లి చేసుకుంటారు అంతా ఫిక్స్ అయిపోయారు. మరి అది నిజమో కాదో.. నిజం అయితే వాళ్ళు అధికారికంగా ఎప్పుడు చెప్తారో చూడాలి.