Prabhas : డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ అవగాహన కోసం ప్రభాస్ చేసిన వీడియో చూశారా?

తాజాగా ప్రభాస్ డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఓ వీడియో చేసాడు.

Prabhas : డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ అవగాహన కోసం ప్రభాస్ చేసిన వీడియో చూశారా?

Prabhas Anti Drugs Video for Telangana Government Watch Here

Updated On : December 31, 2024 / 3:59 PM IST

Prabhas : తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం. ఓ పక్క తనిఖీలు చేస్తూనే మరో పక్క ప్రజల్లో అవగాహన కల్పించడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే సినీ సెలబ్రిటీలతో డ్రగ్స్ వల్ల వచ్చే అనర్దాలను చెప్పిస్తున్నారు.

Also Read : Marco : ‘మార్కో’ మూవీ రివ్యూ .. బాబోయ్ మలయాళం సినిమాలో మరీ ఇంత వైలెన్సా..

తాజాగా ప్రభాస్ డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఓ వీడియో చేసాడు. ఏ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. లైఫ్ లో మనకు బోల్డన్ని ఎంజాయిమెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్ళు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే 8712671111 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు.

ఏదైనా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఆ సినిమాలకు బెనిఫిట్స్ కోసం ఆ హీరోలను ఇలా వీడియో చేయమని సీఎం రేవంత్ గతంలోనే చెప్పగా ఇప్పటికే పలువురు హీరోలు డ్రగ్స్ నివారణ కోసం వీడియోలు చేసారు. అయితే ప్రభాస్ కి ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ లేకపోయినా వీడియో చేయడం ఆసక్తిగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ తో టాలీవుడ్ మీట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Unstoppable With NBK S4 : ఏం డైరెక్ట‌ర్ గారు చొక్కా మీద చొక్కా వేశారు.. బాబీతో బాల‌య్య.. అన్‌స్టాప‌బుల్ ప్రొమో అదిరింది.

ఈ మీటింగ్ లో డ్రగ్స్ నివారణ చర్యల్లో కూడా టాలివుడ్ భాగం కావాలని సీఎం రేవంత్ చెప్పడం, టాలీవుడ్ ఓకే అనడం జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ తో వీడియో చేయించారని తెలుస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ బయటకు వచ్చి ఇలా వీడియోలో మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా డ్రగ్స్ నివారణపై ప్రభాస్ మాట్లాడిన వీడియో చూసేయండి.

ఇటీవలే కల్కి సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నారు.